అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా..

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయడానికి టీడీపీ కుట్ర..

విజయవాడ: .అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.ధర్నాకు 13 జిల్లాల నుంచి భారీగా  అగ్రిగోల్డ్‌ బాధితులు తరలివచ్చారు. ప్రభుత్వం రూ.1100 కోట్లు ఇస్తే, 70 శాతం మంది బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటిరుకు 169 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు మరణించారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ ధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.

Back to Top