ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం

సీఎం వైయస్‌.జగన్‌ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు.

ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలోకి ఐబీ విద్యావిధానం.

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం.

ఒప్పంద పత్రాలు మార్చుకున్న పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఐబీ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్నోవేషన్‌) డాక్టర్‌ Anton beguin.

ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్న ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ olli pekka heinonen.

తాడేప‌ల్లి: ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైయస్‌.జగన్‌ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు ప‌డింది. ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలోకి ఐబీ విద్యావిధానం వ‌చ్చింది.  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం జ‌రిగింది.  ఒప్పంద పత్రాలు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఐబీ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్నోవేషన్‌) డాక్టర్‌ Anton beguin  మార్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా IB Director general, olli pekka heinonen  మాట్లాడుతూ..

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

ఏపీ ప్రభుత్వంతో మా ప్రయాణం ప్రారంభం అవుతుంది.

ఐబీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గారికి, విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు.

మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. 

ఈ సందర్భంగా మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో  చేసుకున్న ఈ ఒప్పందం మీద మేము చాలా నిబద్ధతతో ఉన్నాం. లాభాపేక్షలేని సంస్థ మాది.

విద్యద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది మా లక్ష్యం.

ఇంత పెద్దస్థాయిలో మా సంస్థ భాగస్వామ్యం  కావడం అన్నది ఇదే ప్రథమం.

రాబోయే తరాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ఉద్దేశం.

ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తి. 

 

రెండోది భారత్‌తో విద్యారంగంలో మా సంబంధాలు మరింత మెరుగుపడతాయి. 

నాణ్యమైన విద్యకోసం టీచర్లు, సిబ్బంది నడుమ మంచి వాతావరణాన్ని, వారి సామర్థ్యాలను పెంచుతాం. ఇది మా లక్ష్యం.

పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలు.. వీరందరితోకూడా మా సంబంధాలు మెరుగుపడతాయి.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో గత వారం మాట్లాడాను.

భవిష్యత్తు విద్యారంగంపై మా చర్చలు జరిగాయి.

నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించాం.

 

భారత్‌ మరియు ఏపీలో కొత్త తరహా విద్యావిధానంతో మేం భాగస్వాములం అవుతున్నాం. తొలుత ప్లే బేస్డు లెర్నింగ్‌ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా మేం దృష్టిసారిస్తాం.

దీనివల్ల కొత్త సామర్థ్యాలు వీరికి అలవడతాయి.

 

 సీఎంవైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే...:

ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓలీ పెక్కాకు, ఆన్‌లైన్‌ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. 

 

ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నాను. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు  ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం.  నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. 

భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్‌ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా  భారత్‌ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. 

ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌ మోడల్‌లో ఎడ్యుకేషన్‌ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది.

ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి.

సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. 

పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. 

ఎస్‌ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది.

 

కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సౌరవ్‌ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్‌ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు.

Back to Top