పీఎస్పీల ఏర్పాటుకు ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య ఒప్పందం

తాడేప‌ల్లి: రెండు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు ( పీఎస్పీ)ల ఏర్పాటుకు ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం  వైయస్‌.జగన్‌ సమక్షంలో ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. గ్రీన్‌ హైడ్రోజన్‌రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శ్వేతపత్రం విడుదల చేశారు. బుధ‌వారం పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి  వర్చువల్‌విధానంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ భూమిపూజ చేశారు.  కార్య‌క్ర‌మంలో విద్యుత్, అటవీపర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రి(దేవాదాయశాఖ) కొట్టుసత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ కె వి ఎన్‌ చక్రధరబాబు, ఎన్‌ఆర్‌ఈడీసీఏపి వీసీ ఎండ్‌ ఎండీ ఎస్‌ రమణారెడ్డి, బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్, డిప్యూటీ హెడ్‌ మిషన్, యూకె గవర్నమెంట్‌ వరుణ్‌ మాలి, యూకె గవర్నమెంట్‌ సీనియర్‌ అడ్వైజర్‌ నిషాంత్‌ కుమార్‌ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గోయల్, గ్రీన్‌కో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్ శేషగిరిరావు, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ బిజినెస్‌ హెడ్‌ సమీర్‌ మాథుర్, ఎకోరన్‌ గ్రీన్‌ ఎనర్జీ సీఎండీ వై లక్ష్మీ ప్రసాద్, ఆయా కంపెనీల ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top