మళ్లీ వైయ‌స్ జగన్ గారిని ఆశీర్వదించాలి

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అప్ప‌ల నాయుడు
 

శ్రీ‌కాకుళం:  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆశీర్వ‌దించి ముఖ్య‌మంత్రిగా చేసుకోవాల‌ని ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం ఎమ్మెల్యే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి ఇంటికి వెళ్లి ఈ మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించి, బ్రోచ‌ర్ అందించారు. మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును ప్ర‌జ‌ల‌కు  వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగగా తమకు వైయ‌స్‌ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుంది అని ఎమ్మెల్యే కు తెలిపారు.  ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల తలుపు తట్టి మరీ వారినీ ఆప్యాయంగా పలకరించి మన ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి వారు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గారు వచ్చాక తమ ఇంటి పెద్ద కొడుకుగా, కన్న కొడుకు, పెద్ద అన్నగా మీ అందరినీ ఆద‌రిస్తున్నార‌ని, మీకు అండగా నిలుస్తున్నారు అని చెప్పారు.  
 ప్రజా సంకల్ప పాదయాత్రలో  ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడేళ్ల కాలంలో  కరోనా వంటి  విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యలు వైయ‌స్ జగన్ గారికి కే దక్కిందన్నారు. కార్యక్రమంలో  డేంకాడ మండల వైస్ ఎం.పి.పి. శ్రీ తమ్మినాయుడు,   సర్పంచులు, ఎం.పి.టి.సి.లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top