తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నాం

మంత్రి ఆదిమూలపు సురేష్‌

గుంటూరు: తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు భాషా ఔన్నత్యాన్ని కాపాడతామని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నామని తెలిపారు. జాషువా నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెల్తామని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ద్వారా జాషువా కవితలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతులపై జాషువా రచనలు ప్రభావం చూపాయని గుర్తుచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top