ఇంటింటికి ప్రచారంలో దూసుకెళ్తున్న ఆదిమూల‌పు స‌తీష్‌

కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో బ్ర‌హ్మరథం పడుతున్న ప్రజలు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఇంటింటికి ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఆయ‌న చేప‌ట్టిన ఇంటింటికీ ప్ర‌చారానికి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. శ‌నివారం కలపరి గ్రామంలో కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌కు అపూర్వంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఇంటింటా ప‌ర్య‌టిస్తూ ప్రజలతో మమేకమయ్యారు.  ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.  మహిళలు, యువత వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై పూలవర్షం కురిపించారు. ప్రజలను ఎక్కడికక్కడ పలకరిస్తూ ప్ర‌చారాన్ని కొనసాగించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాలన మరువలేనిది.. మళ్లీ ఇదే ప్ర‌భుత్వం రావాలి.. అంటూ జనం నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలతో తమ బతుకులను మార్చారని ప్ర‌జ‌లు ఎదురొచ్చి సంతోషంగా చెబుతున్నారు.  డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌కు మద్దతు తెలిపేందుకు మహిళలు, యువత అధికంగా తరలివచ్చారు.  

ఈ సందర్భంగా కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. జగనన్న ద్వారా అన్ని వర్గాల‌కు ల‌బ్ది చేకూరింద‌న్నారు. మళ్ళీ సిఎంగా జగనన్నను గెలిపించాలని, ఇందుకోసం ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు..

కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. తాను రాజకీయ గొడవలు, ప్రజల్లో కక్షలు పెంచేందుకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు, మంచి చేసేందుకు మాత్రమే వచ్చానని అన్నారు.. ఆసుపత్రికి సంబంధించిన ఏ అవసరం ఉన్న అర్థరాత్రి అయినా తనను కలువవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రతి పేదవాడి ఇంటికి నేనే డాక్టర్ అవుతానని అన్నారు. కోడుమూరులో పిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకుంటానని, ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునేందుకు వారికి దిశ నిర్దేశం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు. కోడుమూరులో సాగునీరు, తాగునీరుకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. కోడుమూరులో రోడ్డు సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి లింకు రోడ్లను ఏర్పాటు చేస్తానని అన్నారు.  కోడుమూరును ప్రతి అంశంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు..

 కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, వెంకటేష్, కలపరి గ్రామ నాయకులు గిడ్డయ్య, పురంధర్ రెడ్డి, రాజారెడ్డి, గుంటేప్ప, వెంకటేశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, మనోహర్, కృష్ణారెడ్డి, సత్యరెడ్డి, ఎర్రన్న, దస్తగిరి, నరసింహ రెడ్డి, రుషిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు 

Back to Top