ఆంధ్రరాష్ట్ర ప్రజల కోరిక నెరవేరుతుంది

ఆదాల ప్రభాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు చేరలేదని బాధపడుతున్నానన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానం పోటీ చేయమన్నారని, తప్పకుండా గెలిచి తీరుతానన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే ఆంధ్రరాష్ట్ర కోరిక అని, ఇది నెరవేరుతుందన్నారు. 

 

Back to Top