అబ్దుల్‌ కలాంకు సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

నెల్లూరు: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం చిత్రపటానికి సీఎం వైయస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్‌ జగన్‌ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  

Back to Top