ఘ‌నంగా మౌలానా అబుల్ క‌లాం జయంతి వేడుకలు  

తాడేప‌ల్లి: మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌ జయంతి వేడుకలు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో  ఘనంగా జరిగాయి.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ వేడుక‌ల‌కు హాజరై కలాం చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. క‌లాం గొప్ప విజనరీ పర్సన్ అని కొనియాడారు.  మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ జ‌యంతి సంద‌ర్భంగా మైనారిటీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్స‌వాన్ని జరుపుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.  రాష్ట్రంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top