కిర‌ణ్ కుటుంబానికి ఎల్ల‌వేళ‌లా తోడుగా ఉంటాం

చీరాల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌

చీరాల‌: కిర‌ణ్ కుటుంబానికి ఎల్ల‌వేళ‌లా తోడుగా ఉంటామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అన్నారు. ఎస్ఐ దాడిలో మృతిచెందిన యువ‌కుడి కిర‌ణ్ అంత్య‌క్రియ‌ల్లో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పాల్గొన్నారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు. బాధ్యుల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. బాధ్యుత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించార‌న్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌తో కూడా ఫోన్‌లో మాట్లాడార‌ని, `పోయిన వ్యక్తుల‌ను తీసుకురాలేము కానీ, బాధిత కుటుంబానికి అన్ని ర‌కాలుగా వ్య‌క్తిగ‌తంగా, ప్ర‌భుత్వం ప‌రంగా అండ‌గా ఉంటా`న‌ని సీఎం చెప్పారని గుర్తుచేశారు. కిర‌ణ్ కుటుంబానికి ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల ఆర్థికసాయం ప్ర‌క‌టించింద‌న్నారు. కిర‌ణ్ మృతికి కారకులైన వారిని క‌ఠినంగా శిక్షించేందుకు ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని, విచార‌ణ‌కు అడిష‌న‌ల్ ఎస్పీ స్థాయి అధికారిని నియ‌మించింద‌ని గుర్తుచేశారు.

Back to Top