పరిషత్‌ పీఠంపై వైయస్‌ఆర్‌ సీపీ జెండా

కొలువుదీరుతున్న కొత్త కార్యవర్గాలు

98 శాతం ఎంపీపీలు, 100 శాతం జెడ్పీ చైర్మన్‌ పదవులు వైయస్‌ఆర్‌ సీపీ కైవసం

తాడేపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పరిపాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రతిపక్షాల కంటే 45 శాతం ఎక్కువ ఓట్లను దక్కించుకొని వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయాన్ని సాధించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 1,20,10,661 ఓట్లు పోలైతే.. అందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 77,84,427 ఓట్ల వచ్చాయి. జెడ్పీటీసీల్లో 1,26,27,790 ఓట్లు పోలైతే.. వైయస్‌ఆర్‌ సీపీకి 87,83,194 ఓట్లు వచ్చాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో 69.55 శాతం, ఎంపీటీసీల్లో 64.08 శాతం ఓట్లు వైయస్‌ఆర్‌ సీపీకి దక్కాయి. నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. 98 శాతానికి పైగా స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజాపాలనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు నిదర్శనం. 

13 జిల్లాల జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. 13 జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్‌ చైర్మన్ల ఎన్నిక ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీటీసీ, కోఆప్షన్‌ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 3 గంటలకు నూతన జెడ్పీ చైరన్లు, వైస్‌ చైర్మన్లతో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లోనూ సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ 50 శాతం కంటే అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైయస్‌ఆర్‌ సీపీ అవకాశం కల్పించింది. అదే విధంగా జెడ్పీ చైర్మన్లుగా 50 శాతం మహిళలకే పదవులు కేటాయించింది. 
 
ఎన్నిక కానున్న జెడ్పీ చైర్మన్లు వీరే..

చిత్తూరు జిల్లా – శ్రీనివాసులు – (బీసీ) గౌడ
తూర్పుగోదావరి జిల్లా – వేణుగోపాల రావు – (ఎస్సీ) మాల
పశ్చిమ గోదావరి జిల్లా – కవురు శ్రీనివాస్‌ – (బీసీ) శెట్టి బలిజ
గుంటూరు జిల్లా – హెన్రీ క్రిస్టినా – (ఎస్సీ) మాదిగ
కర్నూలు జిల్లా – వెంకట సుబ్బారెడ్డి – (ఓసీ) రెడ్డి
కృష్ణా జిల్లా – ఉప్పాళ్ల హారిక – (బీసీ) గౌడ
నెల్లూరు జిల్లా – ఆనం అరుణమ్మ – (ఓసీ) రెడ్డి
ప్రకాశం జిల్లా – వెంకాయమ్మ – (ఓసీ) రెడ్డి
అనంతపురం జిల్లా – బోయ గిరిజమ్మ – (బీసీ) బోయ
వైయస్‌ఆర్‌ కడప జిల్లా – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి – (ఓసీ) రెడ్డి
విజయనగరం జిల్లా – మజ్జి శ్రీనివాసరావు – (బీసీ) తూర్పు కాపు
శ్రీకాకుళం జిల్లా – పిరియా విజయ – (బీసీ) సూర్య‌బ‌లిజ‌
విశాఖపట్నం జిల్లా – జల్లిప‌ల్లి సుభ‌ద్ర - (ఎస్టీ) గిరిజ‌న పోర్జా 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top