ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

 అమరావతి: భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఏపీలో శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. 

►సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోఖ్య రాజ్, జే మురళి, సీఎస్ఓలు జోషి, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

►సచివాలయ ఆవరణలో సీఎస్‌ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top