రేపు నెల్లూరులో సమరశంఖారావ సభ

  చురుగ్గా ఏర్పాట్లు

  ముస్తాబవుతున్న సభా ప్రాంగణం 

నెల్లూరు :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 5వ తేదీన నెల్లూరులో సమరశంఖారావం సభ ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులో నిర్వహించే సమరశంఖారావం సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఇందు కోసం నెల్లూరులోని ఎన్‌టీఆర్‌ నగర్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న వారికి కుర్చీలు, వాహనాల పార్కింగ్‌ సదుపాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

Back to Top