వైయస్‌ఆర్‌ సీపీలోకి భారీగా చేరికలు

ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 500 మంది టీడీపీ నేతలు

విశాఖ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై.. టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 14, 15, 25 వార్డుల నుంచి 500 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు. విశాఖ అభివృద్ధికి వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉందని వివరించారు. 
 

Back to Top