వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ 

గిద్దలూరు నియోజకవర్గంలో  200 మంది చేరిక

యర్రగొండపాలెం నియోజకవర్గంలో 100 కుటుంబాలు..

 ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. అధికార పార్టీతో విసికి వేశారిన ప్ర‌జలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లాంటి ప‌థ‌కాల‌పై విశ్వాసం వ్య‌క్తం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ వైపు క్యూ క‌డుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు. ప్ర‌కాశం జిల్లాలో దాదాపు 300 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. రాబోయే రోజులన్నీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవే అని గిద్దలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ సీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు అన్నారు.  స్థానిక మధుప్రియ రెస్టారెంట్‌ పైన ఏర్పాటు చేసిన  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ పటిష్టంగా ఉందని రాష్ట్రానికి జగన్‌మోహన్‌ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. పార్టీని గెలిపించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటరును కలసి పార్టీ అధికారంలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. వైయ‌స్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రంలో పేదప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, కాకర్ల శ్రీను, నరాళచెన్నారెడ్డి, మాదాసు వసంత, బల్లా చిన్నగురువయ్య, పెద్దయోగయ్య, తదితరులు పాల్గొన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన కాకర్ల వాసులు
అర్థవీడు మండలం కాకర్లకు చెందిన కాసులపాండు, వెన్నా రంగారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 మంది యూత్, ఇతరనాయకులు ఆదివారం రాత్రి కంభంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా  ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో  పార్టీ విజయం కోసం పాటుపడతామని అన్నా రాంబాబు నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు.

మైనార్టీలకు పెద్ద పీట వేసిన వైయ‌స్ఆర్‌ 
యర్రగొండపాలెం: దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పదవీ కాలంలో మైనార్టీలకు పెద్ద పీట వేశారని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌ పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆదివారం మండలంలోని వీరభద్రాపురంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నుంచి 65 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మైనార్టీలు ఆర్థిక వెసలుబాటు చెందాలని, అన్ని రంగాల్లో ముందుండాలని వైయ‌స్ఆర్‌ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ కేబినేట్‌లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించలేకపోయారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల ఒకరికి స్థానం కల్పించి మమ అనిపించుకున్నారని విమర్శించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో వైయ‌స్ఆర్‌  సీపీ గుర్తుపై పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే డెవిడ్‌రాజు ధనదాహంతో అధికారపార్టీలోకి చేరారని, అటువంటివారిని మరోసారి నమ్మవద్దని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి మాట అటుంచి ఆయన మాత్రం ఎంతో అభివృద్ధి చెందిన విషయం ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. పార్టీ ఫిరాయింపు దారులకు ఎప్పుడు బుద్ది చెప్తామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు.  వీరభద్రాపురం, గడ్డమీదిపల్లె, ఎల్లారెడ్డిపల్లె గ్రామాలకు చెందిన నూర్‌బాష వర్గీయులతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 200 మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు జగన్‌ గుండెళ్లో స్థానం ఉందన్న విషయం గుర్తించాలన్నారు. పార్టీలో చేరినవారికి ఆయన పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. మహిళలకు ఎంపీటీసీ సభ్యురాలు ఎం.కోటమ్మ పార్టీ కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డి.మీరావలి, డి.పెద్దనాగూర్, డి.ఖాశింపీరా, డి.మీరావలి (బ్రహ్మంగారివలి), డి బాదుల్లా, కొలికి అంబయ్య, ఎం.కోటయ్య, ఎం.శ్రీను, ఎం.బ్రహ్మయ్య, జి.వెంకయ్య, జి.బొర్రయ్య, వి.యోగయ్య, ఎస్‌.ఏడుకొండలు ఆధ్వర్యంలో ఆయా కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు డి.కిరణ్‌గౌడ్, ఎ.శ్రీరాములు, వెన్నా మోహన్‌రెడ్డి, ఎం.ఆదిశేషులు పాల్గొన్నారు.

 

Back to Top