ప్రత్యేక హోదాపై రెండో రోజు రాజ్యసభలో నోటీసు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ వేదికగా పోరాటం కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో రెండో రోజు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు నోటీసు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.  

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజైన సోమవారం వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు వేడిపుట్టించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఉభయ సభల్లోనూ నినాదాలు హోరెత్తించారు. లోక్‌సభ, రాజ్యసభలను దాదాపు స్తంభింపజేసేలా పెద్దఎత్తున ఆందోళన చేశారు.  పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళమెత్తారు. ఈ విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలంటూ వైయ‌స్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టి రూల్‌–267 కింద ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చను ప్రారంభించాలని అందులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయిరెడ్డి తన నోటీసులో క్లుప్తంగా ఇలా వివరించారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top