26న తూర్పుగోదావ‌రి జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ఈ నెల 26న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.  రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్‌ సోదరుడు విజయ్‌ గణేష్‌ మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రుకానున్నారు.

ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువు చేరుకుంటారు. అక్కడ డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్‌ గణేష్‌ మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న ముఖ్యమంత్రి. అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
 

Back to Top