ఓట‌రు న‌మోదుకు చివ‌రి అవ‌కాశం

ఈ నెల 23, 24వ తేదీల్లో ప్ర‌త్యేక క్యాంపులు

పోలింగ్ బూత్‌ల్లో అందుబాటులో తాజా ఓట‌ర్ జాబితా 

మీ ఓటు ఉందో..?  లేదో చూసుకోండి! 

అమ‌రావ‌తి:  ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు చాలా విలువైంది. మంచి నాయ‌కుడిని ఎన్నుకునేందుకు ఓటు వ‌జ్రాయుధం లాంటిది. 2019 ఎన్నిక‌ల్లో మ‌న ఓటు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాల‌న్నా..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసే కార్య‌క్ర‌మంలో మీరు కూడా భాగ‌స్వాములు కావాలంటే జాబితాలో మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. ఎన్నిక‌ల సంఘం ఈ నెల 23, 24వ తేదీల్లో ప్ర‌త్యేక క్యాంపులు నిర్వ‌హిస్తోంది. స్థానిక పోలింగ్ బూతుల్లో తాజా ఓట‌రు జాబితాను అందుబాటులో ఉంచారు. జాబితాలో మీ ఓటు ఉందో..లేదో స‌రి చూసుకోండి. ఏదైనా త‌ప్పులు ఉంటే స‌రిచేసుకునేందుకు చివ‌రి అవ‌కాశం..అలాగే కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకునేందుకు కూడా ఇదే అఖ‌రు. ఈ ప్ర‌త్యేక క్యాంపుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పార్టీ శ్రేణులు, గౌర‌వ పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షులు, పార్ల‌మెంట్‌, అసెంబ్లీ కో-ఆర్డినేట‌ర్లకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

గౌర‌వ పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌కు, పార్ల‌మెంటు, అసెంబ్లీ కో-ఆర్డినేట‌ర్ల‌కు మ‌రియు ఇత‌ర ముఖ్య నాయ‌కుల‌కు న‌మ‌స్కార‌ములు,

ఫిబ్రవరి 23,24 తేదీల్లో (శ‌ని మ‌రియు ఆదివారాల్లో) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ ల‌లో ఎన్నిక‌ల సంఘంవారు ''ప్రత్యేక క్యాంపులను'' నిర్వ‌హించ‌నున్నారు.
స‌మ‌యం: ఉ.9 నుండి సా.5 గంట‌ల వ‌ర‌కు
1) ఫిబ్ర‌వ‌రి 23, 24వ‌ తేదీల‌లో బూత్ స్థాయి అధికారులు (BLOs) పోలింగు బూత్ లో తాజా ఓట‌ర్ల జాబితాతో అందుబాటులో ఉంటారు. ఓట‌ర్లు వారి యొక్క ఓట‌రు న‌మోదును జాబితాలో ప‌రిశీలించుకోవ‌చ్చును.
2) మ‌న పార్టీ త‌ర‌పున నియ‌మించ‌బ‌డిన బూత్ స్థాయి స‌హాయ‌కులు (BLAs),బూత్ క‌న్వీన‌ర్లు,క‌మిటీ స‌భ్యులు ఆ తేదీల్లో బూత్ వ‌ద్ద అందుబాటులో ఉండేలా చూసుకోగ‌ల‌రు.
3) ప్ర‌తి పోలింగ్ బూత్ వ‌ద్ద ఈ క్రింది పేర్కొన్న ఫారాలు అందుబాటులో ఉంటాయి.
ఓట‌ర్ల న‌మోదు కొర‌కు ఫారం-6
తొల‌గింపుల కొర‌కు ఫారం-7
పేరు మార్పుల కొర‌కు ఫారం-8
అదే నియోజ‌క‌వ‌ర్గంలో వేరే బూత్ లోకి అడ్ర‌స్ మారిన వారికొర‌కు ఫారం-8A
4) ఎపిక్ కార్డ్‌ (ఓట‌రు గుర్తింపు కార్డు) క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ,ఓట‌రు జాబితాలో పేరు లేనిచో త‌న యొక్క ఓటు హ‌క్కును వినియోగించుట‌కు అవ‌కాశం ఉండ‌దు.కావున‌, ఓట‌ర్ల జాబితాలో పేరు ఉందా? లేదా? అన్న విష‌యాన్ని త‌ప్ప‌క‌ చెక్ చేసుకుని, పేరు లేన‌ట్ల‌యితే వెంట‌నే ఫారం-6 లో వివ‌రాలు పొందుప‌ర‌చి, ఫోటో,వ‌య‌స్సు & అడ్ర‌స్ ప్రూఫ్‌లు జ‌త‌ప‌ర‌చి అక్క‌డే ఉన్న BLO గారికి స‌మ‌ర్పించాలి.

ఓటర్ల స‌వ‌ర‌ణ కొర‌కు ఈ రెండు రోజుల్లో స‌మ‌ర్పించబ‌డిన‌ అన్ని విన‌తిప‌త్రాలపై విచార‌ణను పూర్తిచేసి, మార్చి 7క‌ల్లా ఎన్నికల సంఘం త‌గు చ‌ర్య‌లు చేపట్టనుంది కావున‌, ఈ అవకాశాన్ని సద్వినియోగప‌ర‌చుకునేలా పోలింగ్ బూత్ క‌న్వీన‌ర్లను, క‌మిటీ స‌భ్యుల‌ను, పార్టీ మండల స్థాయి నాయకులను, నియోజకవర్గ ముఖ్యనాయకులను స‌మాయ‌త్తం చేయ‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి.

వి.విజ‌య‌సాయి రెడ్డి, MP
జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

 

Back to Top