పాద‌యాత్ర‌లో ఇచ్చిన మ‌రో హామీ అమ‌లు  

ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్య‌ర్థులు

తాడేప‌ల్లి: ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల‌ను సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లుగా నియామ‌కానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్య‌ర్థులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి త‌మ సంతోషాన్ని వ్య‌క్తప‌రిచి.. సీఎంకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top