జగనన్నతోనే రాష్ట్రం బాగుపడుతుంది

 వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

200 మంది వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

నెల్లూరు: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కడుదామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లకు చెందిన సుమారు 200 మంది డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తూ వారి మధ్యలో తిరుగుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమిస్తే మంచి రోజులు వస్తాయన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమన్నారు. 

ఏ రోజూ ప్రజల గురించి పట్టించుకోని మంత్రి నారాయణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏమి కావాలన్నా అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఏ ఒక్క విద్యార్థికీ, అదే విధంగా నారాయణ వైద్యశాలలో పేదలకు ఉచితంగా చికిత్స చేసిన దాఖలాల్లేవని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్లు, నగరంలో ఏర్పాటు చేస్తున్న పార్కుల్లో నారాయణ, టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి వారి హక్కులను కాపాడానని గుర్తు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు అంతం దగ్గరపడిందన్నారు. వైయస్‌ జగన్‌ పాలన త్వరలో రానుందన్నారు. అనంతరం నెల్లూరు మూడో డివిజన్‌కు చెందిన మిట్టా ధనుంజయ, వసంత్‌కుమార్, 52వ డివిజన్‌కు చెందిన పఠాన్‌ షఫీఖాన్‌ వారి మిత్ర బృందానికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సోము, రమణ, శ్రీహరి, సతీష్, నాగరాజు, రాజేంద్ర, రత్తయ్య, వినోద్, 52వ డివిజన్‌ నుంచి లియాఖత్, ఫైరోజ్, రహంతుల్లా, సమీర్, షోయబ్, ముసార్, ముస్తాక్, అతహర్, మన్సూర్, తదితరులు పార్టీలో చేరారు. 

Back to Top