తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (18.02.2024) అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రాప్తాడులో ఏర్పాటు చేసిన వైయస్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ `సిద్దం` లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాప్తాడు చేరుకుంటారు, అక్కడ జరిగే వైయస్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ – సిద్దం – బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.