ఏపీకి 13వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022 అవార్డు

వ్యవసాయ శాఖ అధికారులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అవార్డు కైవసం చేసుకుంది. రాష్ట్రానికి వచ్చిన అవార్డును సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. శేఖర్‌ బాబు గెడ్డం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చూపించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్ళుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఏపీ ప్ర‌భుత్వం అవార్డును కైవసం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.

Back to Top