మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు

100 జియో టవర్స్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం  వైయస్‌.జగన్ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. 100 జియో టవర్స్‌ను తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్‌, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఎస్‌ఆర్‌ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

Back to Top