డబ్బుతో కాదు..ప్రజాభిమానంతో గెలవాలి

మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు

డబ్బు పంపిణీలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది

టీడీపీ అక్రమాలపై ఎన్నికల సంఘం స్పందించాలి

వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: ఎన్నికల్లో ప్రజాభిమానంతో గెలవాలని,డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తే తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని  నెల్లూరు సిటీ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.మంత్రి నారాయణ డబ్బుతో ఓట్లను కొనేందుకు యత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ బలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.డబ్బులు పంపిణీలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులతో డబ్బు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల  క్రితం చీరలతో పట్టుబడ్డారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
రూ.15లక్షల నగదు స్వాధీనం
ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి టీడీపీ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. నెల్లూరు చిన్నబజార్‌లో  రూ.50 లక్షలుపంచుతుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు రూ.15 లక్షలు నగదును పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు..ఓటర్లను మంత్రి నారాయణ ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి

 

Back to Top