రికార్డులు తెప్పిస్తా..రాజీనామా చేసి వెళ్ళిపోతారా ?

చంద్రబాబుకు సీఎం వైయస్‌ జగన్‌ సవాల్‌..

గత ప్రభుత్వం సున్నా వడ్డీ  పథకానికి రూపాయి కూడా కేటాయించలేదు..

ప్రతిపక్షం అవాస్తవం మాట్లాడుతోంది..

అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

 

గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరుకు రైతులకు సున్నా వడ్డీ కింద ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు.వాస్తవాలు నిగ్గు తేల్చడానికి  రికార్డులు తెప్పిస్తా...రాజీనామా చేసి  ఇంటికి వెళ్లిపోతారా అంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.  సమాధానం చెప్పమంటే చంద్రబాబు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు సత్యదూరం అని  సున్నా వడ్డీ పథకానికి ఎంత డబ్బులు కేటాయించారో సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా పథకం తీసుకువస్తే అభినందించాల్సింది పోయి..ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.ఒక సారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top