వైయస్‌ఆర్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైయస్‌ జగన్‌
 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయస్‌ఆర్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రారంభమైంది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం సభలో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు చేయనున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొంటారు.

 

Back to Top