బ్యాంకు రుణాలపై మారటోరియం విధించాలి

తిరుప‌తి: కరోనా థర్డ్ వేవ్ (ఒమిక్రాన్) నేపథ్యంలో బ్యాంకుల నుంచి వాణిజ్య, ఆతిథ్య‌ రంగ వ్యాపార సంస్థలు తీసుకొన్న రుణాలపై మారటోరియం విధించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఈ అంశంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. దేశంలో ఓమిక్రాన్, కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి కారణంగా తీవ్రంగా ప్రభావం చూపుతున్న అన్ని వాణిజ్య , వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రుణ మారటోరియంను పరిగణనలోకి తీసుకొని ఉంటే కేంద్ర మంత్రి స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. కోవిడ్-19 (ఓమిక్రాన్) మూడవ వేవ్ వ్యాప్తి కారణంగా తిరుపతిలో అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య పరిశ్రమ మరోసారి తీవ్రంగా ప్రభావితమైందన్నారు. హోటళ్ల వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్ ప్రైవేట్ ట్యాక్సీ ఆపరేటర్లు భారీ నష్టాలను చవిచూడడంతో వారికీ గొప్పగా ఆదాయం వచ్చే అవకాశం లేకున్నా నష్టాలను ఎంతో కొంత పూడ్చుకొనేకి అలాగే నమ్ముకొన్న వ్యాపారాన్ని వదిలేయలేక నష్టపోయిన మొత్తము తిరిగిరాదు అని తెలిసిన వారి వ్యాపారానికి ప్రారంభించే దశలో ఉన్నారు. కోవిడ్-19 ప్రభావిత వ్యాపారులందరికి రుణ మారటోరియం పొడిగించాలని  కేంద్ర ఆర్థిక మంత్రిని ఎంపీ కోరారు. హాస్పిటాలిటీ పరిశ్రమలు, వర్తక సంఘాన్ని ఆదుకోవాలని ఆయ‌న కేంద్రాన్ని డిమాండు చేశారు. COVID-19 థర్డ్ వేవ్ ద్వారా తీవ్రంగా ప్రభావితమైన వ్యాపారాలకు రుణ మారటోరియం చాలా ముఖ్యమైంద‌ని ఎంపీ గురుమూర్తి లేఖ‌లో పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top