తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి సిరివెన్నెల‌

హైద‌రాబాద్‌:  సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి పేర్ని నాని నివాళుల‌ర్పించారు. ఈ ఉదయం ఫిలిం చాంబర్ వ‌ద్ద సిరివెన్నెల భౌతికకాయానికి నివాళుల‌ర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.  సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top