తాడికొండ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌త్తెర సురేష్‌కుమార్‌

గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తాడికొండ నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌త్తెర సురేష్ కుమార్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవ‌ల గుంటూరు జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు. దీంతో ఆయ‌న‌ స్థానంలో కత్తెర సురేష్‌కుమార్‌ను నియమించారు.    

Back to Top