కోడెల చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంటి రాంబాబు

ఈవీఎంల ట్యాంపరింగ్‌లు జరిగితే ..బాబుకు 150 సీట్లు ఎలా వస్తాయి?

ఓడిపోతానని అర్థమై చంద్రబాబు అర్థంపర్థం లేని మాటలు 

కోడెలపై కేసు పెట్టేందుకు ఎందుకు జాప్యం చేశారు? 

పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌కు కోడెల ప్రయత్నించారు.

గుంటూరు: కోడెల శివప్రసాదరావు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ నెల 11వ తేదీ జరిగిన ఎన్నికల్లో కోడెల పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నించారని, అక్కడున్న ప్రజలు ఆయనపై దాడి చేయలేదని, కేవలం రియక్ట్‌ అయ్యారని తెలిపారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని అంబటి ప్రశ్నించారు. ఓటమి ఖాయమని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  
ఎన్నికలు ముగిశాయి..ఓట్ల లెక్కింపునకు చాలా వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో చంద్రబాబు రకరకాల విశ్లేషణలు, మాటలు మాట్లాడుతున్నారు. చాలా సీనియర్‌ పొలిటీషియన్, పదనాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎన్నికల నిర్వాహణపై చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ విఫలమైందని మాట్లాడారు. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదన్నారు. ఈవీఎంలు మొరాయించాయి..ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. లోపభూయిష్టంగా ఎన్నికలు జరిగితే టీడీపీ 150 సీట్లు గెలుస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ పార్టీకి అన్ని సీట్లు ఎలా వస్తాయి? అధ్వాన్నంగా జరిగితే 150 వస్తాయా? మరోవైపు లోపభూయిష్టంగా జరిగాయంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి డ్రామాలాడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ను బెదిరిస్తున్నారు. చంద్రబాబుకు అధికారం చేజారిపోతుందనుకున్నప్పుడు ఆయన మనస్తత్వం ఇలాగే ఉంటుందేమో? తన మనసుకు అర్థమైన తరువాత ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. సీనియర్‌ పొలిటీషియన్‌గా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి చాలా విషయాలు..చాలా ఆవేశంగా మాట్లాడారు. కారణం ఏంటంటే పోలీసులు అతికష్టం మీద కోడెలపై నిన్న కేసు నమోదు చేశారు. ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లోకి కోడెల వెళ్లి అక్కడ వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లను బెదిరించి, ఎన్నికల స్టాప్‌ను బెదిరించి రిగ్గింగ్‌ చేయాలని బెదిరించారు. దానిపై మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించలేదు. 11వ తేదీ ఈ సంఘటన జరిగితే..12వ తేదీ మా పార్టీ శ్రేణులు వెళ్లి ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకోవడానికి కూడా పోలీసులు ముందుకు రాలేదు. ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి.  కోడెలపై కేసు నమోదు చేయడంతో ఆయనకు కోపం వచ్చింది. ఉక్రోషంతో నిన్న చాలా ఆవేశంగా..అహంకారపూరితంగా మాట్లాడారు. వైయస్‌ జగన్‌ చంద్రబాబుకు పోటీనా..నాకు అంబటి రాంబాబు పోటీనా అని మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యదేశమిది. వైయస్‌ జగన్‌ గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి కేవలం 5 లక్షల స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ విషయం మీ దృష్టిలో లేదా?. నా మీద గత ఎన్నికల్లో పోటీ చేసిన కోడెలకు కేవలం 924 ఓట్లు మాత్రమే అధిక్యం వచ్చిందన్న సంగతి మరిచిపోయారా?. మమ్మల్ని కించపరిచే విధంగా, అహంకారపూరితంగా కోడెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కోడెల శివప్రసాద్‌కు ఇది ధర్మమేనా? ఇదంతా చూస్తుంటే సుమతి శతకంలో ఓ పద్యం గుర్తుకు వస్తుంది. బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఈ పధ్యం కోడెలకే రాసినట్లుగా ఉంది. మే 23న బ్యాలెట్‌లో మీ బలమెంతో తెలుస్తుంది. ఇనిమెట్లలో నీ మీదా జరిగింది దాడి కాదు..నీవు రౌడీలను తీసుకెళ్లి రిగ్గింగ్‌ చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు కేవలం రియాక్ట్‌ అయ్యారు. ఈవీఎంలు తెరిచాక నీ మీద ప్రజాస్వామ్యబద్ధంగా దాడి జరుగబోతోంది..ఈ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని మనవి చేస్తున్నా. ఎన్నికల ఫలితాలు చూశాక కోడెల తల ఎక్కడ పెట్టుకుంటారో? . నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఏంటి? నీ రాజకీయ జీవితమంతా కూడా బూత్‌ క్యాప్చరింగ్‌..ఓటర్లను, ఎన్నికల సిబ్బందిని బెదిరించడమే, బ్లాక్‌మెయిల్‌ చేయడం, బాంబులు వేయడం, వర్గాల మధ్య తగాదాలు పెట్టి లబ్ధిపొందడం.. ఇదే నీ రాజకీయ అనుభవం.  నరసరావుపేటలో గెలవలేక సత్తనపల్లెకు పారిపోయావు. నీయంత ట్యాంపరింగ్‌ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే..వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేసే సత్తా నీకు లేదు. æశాసన సభాపతిగా నీవు నిర్వహించిన తీరు సరైనదేనా? ఓడిపోయిన తరువాత ఆత్మ విమర్శ చేసుకోమని మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన వ్యక్తిత్వం, దుర్మార్గమైన లక్షణాలు కలిగిన వ్యక్తి కోడెల శివప్రసాదరావుది. 
 

తాజా వీడియోలు

Back to Top