నిజంగా ఇది పండుగ దినం 

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పుట్టిన రోజు ఏపీ ప్ర‌జ‌ల‌కు నిజంగా పండుగ దిన‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఆరోగ్య‌శ్రీ‌, 108 అంబులెన్సులు ప్రవేశపెట్టిన డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖర రెడ్డిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోరని చెప్పారు. ఫీజు చెల్లింపు పథకంతో పేదల చదువుల కలలను నిజం చేసిన చిరస్మరణీయుడు వైయ‌స్ అని ప్రశంసించారు. రాజన్న అని పిలిస్తే పలుకుతాడు అనే ధైర్యం ప్రజలకు కల్పించిన మహా మనీషి రాజశేఖరరెడ్డని వ్యాఖ్యానించారు. ఈరోజు వైఎస్ 70వ జయంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వరుస కరవులతో కుదేలైన వ్యవసాయ రంగానికి వైయ‌స్ ఊపిరి పోశారు. ఉచిత విద్యుత్తు, రుణమాఫీలతో పాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టారు. ఆయన సీఎంగా ఉన్న అన్నిరోజులూ వరుణదేవుడు పిలవకుండానే పలికేవాడు. సీఎంగా చెరగని ముద్ర వేసిన మహనీయడైన వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి నిజంగా పండుగ దినం’ అని ట్వీట్ చేశారు.

Back to Top