చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు

వైయస్‌ జగన్‌ సీఎం అయిన వేళా విశేషం రాష్ట్రానికి జలకళ

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి:  చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కొత్తగా ముంచాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళా విశేషం వర్షాలతో రాష్ట్రానికి జలకళ వచ్చిందన్నారు. జలాశయాలు నిండిపోయాయి.  

2009 తర్వాత ఇప్పుడు మళ్లీ కృష్ణానదికి వరద వచ్చిందని చెప్పారు. ఐదేళ్లుగా కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉంటే ఒక కుటుంబం బాధపడుతోందన్నారు. జలాశయాలు నిండి ప్రజలంతా సంతోషంగా ఉంటే..చంద్రబాబు మాత్రం నా ఇల్లు ముంచేస్తున్నారనంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వరదలపై టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కరకట్టపై అక్రమ కట్టడంలో ఉండటం సరైంది కాదన్నారు. వరదను అంచనా వేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తే చంద్రబాబు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలకు ముప్పు ఉందని రివర్‌ కన్జర్వేటర్‌ స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారని పేర్కొన్నారు. 

Back to Top