అవినీతి విషసర్పాలను ప్రజలు చితగ్గొట్టారు

అయినా సిగ్గులేకుండా పచ్చసర్పాలు మాట్లాడుతున్నాయి

తప్పులు లేకుండా నాలుగు పదాలు మాట్లాడే దమ్ము లోకేష్‌కు ఉందా

చంద్రబాబు అసమర్థత వల్లే విత్తన కొరత ఏర్పడింది

ఐదేళ్లలో రాష్ట్ర అప్పును రూ.2.5 లక్షల కోట్లకు పెంచిన నీచులు మీరు

సీఎం వైయస్‌ జగన్‌ సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

విజయవాడ: ఐదు సంవత్సరాలు పచ్చ విష సర్పం నాయకత్వంలో అవినీతి పాములు రాష్ట్రంలోని జనాల మీద పడి విలయతాండం చేశాయి. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో, వీధుల్లో పాములు తిష్టవేసి కూర్చున్నాయి. కొండ చిలువలు, నల్లత్రాచులు, కట్లపాములు వీటన్నింటినీ ప్రజలు ఎన్నికల్లో చితగ్గొట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. వీటన్నింటికీ నాయకత్వం వహించే పచ్చ విష సర్పం ఒకటి తప్పించుకొని వీధుల్లో తిరుగుతుందని, దీనికి కూడా ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 పాములను ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంపేశారని, మరో 23 పాములు తప్పించుకున్నాయని ఎద్దేవా చేశారు. తప్పించుకున్న పాముల సంగతి కూడా లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో తేలిపోతుందన్నారు. అదే విధంగా ఢిల్లీకి వెళ్లాలని 25 రకాల పాములు పోటీలో దిగితే.. వాటిలో 22 పాములకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజానీకం చేసిన సర్పయాగమన్నారు. 

చంద్రబాబు విత్తనాల కొరత గురించి, విద్యుత్‌ కోతల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. కోతలు కోసి అబద్ధాలను నిజాలు చేయాలనుకుంటున్నాడని, ఎన్నికల్లో తమ తీర్పుతో ప్రజలు చెంపపై పెల్లున కొట్టినా సిగ్గులేకుండా అనైతిక రాజకీయాలు ప్రదర్శించడం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర అప్పును రూ. 2.5 లక్షల కోట్లకు పెంచాడని మండిపడ్డారు. విద్యుత్‌ సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన రూ. 48 వేల కోట్ల బకాయి ఎందుకు చెల్లించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. చౌకగా వస్తున్న విద్యుత్‌ను కొనుగోలు చేయకుండా.. తన తాబేదారులైన విద్యుత్‌ సంస్థల యాజమానులకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టాడన్నారు. 

జూన్‌ 8వ తేదీ వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పదే పదే చెప్పిన చంద్రబాబు.. ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను ఎందుకు చేపట్టేలేదని, విత్తన సంస్థలకు ఎందుకు బకాయిలు చెల్లించలేదని చంద్రబాబును ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రశ్నించారు. విత్తనాల కొరత చంద్రబాబు అసమర్థత వల్లే ఏర్పడిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు అయితే ఈ 40 రోజుల్లోనే చంద్రబాబు 400 అబద్ధాలను ప్రచారంలోకి తీసుకువచ్చాడని ధ్వజమెత్తారు. బాబు నీచ రాజకీయాన్ని ఆయన కొడుకు లోకేష్‌ కూడా వారసత్వంగా తీసుకున్నాడని, తప్పులు లేకుండా లోకేష్‌ నాలుగు పదాలు తెలుగులో మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు. ఇద్దరూ సిగ్గు ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

 

Back to Top