బాబు, పవన్‌ రహస్య స్నేహితులు

జనసేన పార్టీకి అసలు స్ట్రక్చర్‌ లేదు

ఇంకా ఎంతకాలం బాబు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతారు

స్పష్టమైన వైఖరితో ఉండండి.. గోడ మీద పిల్లిలా వ్యవహరించొద్దు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

హైదరాబాద్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు రహస్య స్నేహితుడని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే పవన్‌ చదువుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చట్టదిద్దేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోశయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విజయవాడ, విశాఖల్లో పెద్ద కాన్ఫరెన్స్‌లు పెట్టిందని, ఎంత ఖర్చు పెట్టారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారని పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు పవన్‌ చదువుతున్నారు. జనసేన పార్టీకి అసలు స్ట్రక్చర్‌ లేదన్నారు.

చంద్రబాబు అక్రమాలపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రశ్నించారు.  ఆర్భాటాల కోసం చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పుష్కలంగా పడుతున్నాయన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందుతున్నాయన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని ప్రజలంతో సంతోషంగా ఉన్నారన్నారు. మొదటి సారి అమరావతి వెళ్లిన పవన్‌ భూసేకరణకు ఒప్పుకోను అని మాట్లాడడని, ఇటీవల అమరావతి వెళ్లి రాజధాని కట్టాల్సిందే అని పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాని తీవ్రంగా చంద్రబాబు దోపిడీ చేశారన్నారు. రాజధాని మీద ప్రకటన చేయాలని పవన్‌ కోరుతున్నాడని, అసలు రాజధాని లేదని ఎవరు మాట్లాడారో చెప్పాలన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఇంకా స్క్రిప్టు రీడింగ్‌ మానుకోవాలని ఎమ్మెల్యే కిలారి రోశయ్య సూచించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసే అభివృద్ధి పవన్‌కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు గురించి పవన్‌ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు పల్నాడు అంశం తీసుకొని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తప్పని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ దయచేసి స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని గోడమీద పిల్లిలాగా వ్యవహరించొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు
.

 

Back to Top