సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాల్ని ప్రజలు శభాష్‌ అంటున్నారు

టీడీపీ నేతలు వరద రాజకీయాలు చేస్తున్నారు

చంద్రబాబును ఐదు కోట్ల మంది రాజకీయంగా హత్య చేశారు

ఎమ్మెల్యే జోగి రమేష్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలు మెచ్చుకుంటూ శభాష్‌ అంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. టీడీపీ నేతలు వరద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోకి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఎటువంటి లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. వరద నష్టంపై సర్వే చేసి అంచనాలు సిద్ధం చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. వరద బాధితులకు మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని చెప్పారు. బాధితులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. కరకట్టపై వందల నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదని, ఆయన్ను ఐదు కోట్ల మంది రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం 19 చట్టాలకు ఆమోదం తెలిపిందని, ఈ చట్టాలు ప్రజలకు ఉపయోగపడ్డాయని తెలిపారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మన రాష్ట్రంలో చేసి చూపించారని తెలిపారు. వైయస్‌ జగన్‌ నిర్ణయాల్ని ప్రజలు శభాష్‌ అంటున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. వైయస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అర్థం లేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Back to Top