ముఠా కక్షలను రెచ్చగొడుతూ బాబు హత్యా రాజకీయాలు

జంగం హత్యకు టీడీపీ బాధ్యత వహించాలి

మానవహక్కుల పరిరక్షణ గురించి బాబు మాట్లాడడం సిగ్గుచేటు

ఊరూరు తిరుగుతూ కుట్ర రాజకీయాలకు తెర

సీఎం వైయస్‌ జగన్‌ చేసే మంచిని ఓర్వలేక విషప్రచారం

ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మాట్లాడు చంద్రబాబూ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

 

తాడేపల్లి: ఊరూరు తిరుగుతూ చంద్రబాబు ముఠా కక్షలను రెచ్చగొడుతూ హత్యా రాజకీయాలకు తెరతీస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను హత్యలు చేయిస్తున్నాడన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో జంగం అనే వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తను టీడీపీ నేతలు బల్లెంతో పొడి అతి కిరాతకంగా చంపేశారన్నారు. దీనికి చంద్రబాబు, టీడీపీనే బాధ్యత వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పొడిచి చంపారని, దీన్ని ప్రజాస్వామ్య వాదులు అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ టీడీపీ కార్యకర్తలకు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడని, బాబు తీరు వల్లే జంగం హత్య జరిగిందన్నారు. చంద్రబాబు ఓడిపోయిన నాటి నుంచి ప్రెస్టేసన్‌తో ఊరూరు తిరుగుతూ పులివెందుల పంచాయతీ, రాష్ట్రం బిహార్‌లా తయారైందని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని అంబటి అన్నారు. అమరావతి ప్రజావేదిక కూలగొట్టారని, నెల్లూరులో ఇళ్లు కూలగొట్టారని, రాష్ట్రంలో ఏదో గందరగోళం జరుగుతుందనే భ్రమ కల్పించేందుకు చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు.

గత ఐదేళ్లు అమరావతిలో అద్భుతం జరుగుతుందని పత్రికల్లో రాయించడం, గ్రాఫిక్స్‌ చూపించినట్లుగా ఇవాళ కూడా లేనిదాన్ని ఉన్నట్లుగా టీడీసీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ధిపొందాలని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. బీజేపీలోకి వెళ్లగా మిగిలిన ముగ్గురు ఎంపీలు రాష్ట్రంలో ఏదో జరుగుతుందని నమ్మించే ప్రయత్నంలో భాగంగా నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు వినతిపత్రం అందించారన్నారు.

Read Also: పీపీఏల విషయంలో ఏపీ గెలుపు

వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంచి పరిపాలన అందించాలని, నైతిక విలువలను పెంచుకోవాలనే సీఎం వైయస్‌ జగన్‌ ధర్మంతో పాలన చేస్తుంటే చంద్రబాబు బురదజల్లుతున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ నవరత్నాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ప్రజల్లో మంచి భావన వస్తుందని అది చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లు మీడియా గొంతు నొక్కారు. ప్రజల హక్కులను హరించారు. వైయస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేయించారని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం, అతని కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేశాడని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ మానవ హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

కులం, మతం, ప్రాంతం చూడం, చివరకు పార్టీలు అసలే చూడం అని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెబుతున్నారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారని అంబటి చెప్పారు. చట్టవ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కానీ, చంద్రబాబూ నోటికి వచ్చినట్లుగా బీహార్, పులివెందుల పంచాయతీ అంటూ మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు.  

కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. 19 కేసులు పెట్టారని, వేధింపులకు గురిచేశారని మాట్లాడాడని, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రతినిధులు వచ్చి విచారణ జరిపించి వాస్తవం తేల్చాలన్నారు. కోట్లాది రూపాయల ఫర్నీచర్‌ను అక్రమంగా తీసుకెళ్తే రూ. పది లక్షల ఫర్నీచర్‌ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, హైదరాబాద్‌లోని శాసనసభలో ఉన్న బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ టేబుల్‌ కోడెల శివరాం షోరూంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఇంకా చాలా ఫర్నీచర్‌ తీసుకెళ్లారని, వాటినీ రికవరీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తనను కలుసుకునేందుకు కరకట్టకు ఎవరూ రావడం లేదని చంద్రబాబూ ఊరూరు తిరిగే కార్యక్రమం చేపట్టి ప్రభుత్వంపై విషప్రయోగం చేస్తున్నాడని అంబటి ఫైరయ్యారు. ప్రజలెవరూ చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరని, సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ముందుకుసాగుతున్నారన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు జ్ఞానం తెచ్చుకొని చేసే మంచిని చూసి ప్రభుత్వాన్ని అభినందించాలని, లేదా చేతులు కట్టుకొని మూలకు కూర్చోవాలని సూచించారు. 

 

Read Also: పీపీఏల విషయంలో ఏపీ గెలుపు

   

తాజా వీడియోలు

Back to Top