నీతివంతమైన పాలనకు వైయస్‌ జగన్‌ కృషి

 ఎమ్మెల్యే అంబటి రాంబాబు

వైయస్‌ జగన్‌ పాలనను విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదు

ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం దురదృష్టకరం

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క జాబు అయినా వచ్చిందా?

వంద రోజుల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం

అమరావతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నీతివంతమైన పరిపాలనకు కృషి చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబు, లోకేష్‌ సహించలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ వంద రోజుల పాలన నీతివంతంగా, స్వచ్ఛంగా సాగుతుంటే చంద్రబాబు ప్రభుత్వపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

ఒక స్వచ్ఛమైన పరిపాలన, అవినీతిరహితమైన పాలన, విప్లవాత్మకమైన పరిపాలన అందించాలన్న గొప్ప సంకల్పంతో ఈ వంద రోజులు కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పని చేశారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషించదగ్గ పరిణామన్నారు. ఇంత పిన్న వయసులో, యువకుడిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అవడం అరుదైన సంఘటన అన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఈ చిన్న వయసులోనే సీఎం అయ్యారు. వారిలో వైయస్‌ జగన్‌ ఒక్కరు. వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పరిపాలన చేయాలని ఒక ధృఢ సంకల్పంతో ఈ వంద రోజులు పాలించారు..ఇందులో విజయం సాధించారన్నారు. ఒక సుపరిపాలన అందించాలని, అవినీతిరహిత పరిపాలన అందించాలని వైయస్‌ జగన్‌ తపనతో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఈ రాష్ట్రం అవినీతిగా మారుతుందని, హింసాగా మారుతుందని, దుకుడుగా వ్యవహరిస్తారని ఆనాడు చంద్రబాబు వీధి వీధికి వెళ్లి ప్రచారం చేశారన్నారు.

వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఒక చక్కని పాలన,  అవినీతిని అంతం చేయాలని పాలిస్తున్నారన్నారు. మా పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే..మా నాయకుడు మాకు "ఎవరూ అవినీతికి పాల్పడకూడదు'' అని సూచించారన్నారు. గతంలో టీడీపీ నేతలు సహజ సంపదలను, ఇసుక, మట్టిని దోచుకుని వందల కోట్లు సంపాదించారన్నారు. చివరికి ప్రజలకు అలాంటి నేతలు దూరమయ్యారు. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మొదటి సభలోనే చట్టబద్ధం చేశామన్నారు. మేధావులను, ప్రజలను కోరుతున్నాం. చక్కని పరిపాలన వైయస్‌ జగన్‌ అందిస్తున్నారని ఆలోచన చేయాలని కోరుతున్నాను. చంద్రబాబు ఏదో ఒక బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో ఆరు మాసాల వరకు ఏం మాట్లాడనని చెప్పిన చంద్రబాబు మూడుమాసాలకే నోరు విప్పాడన్నారు.

చంద్రబాబు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రయత్నిస్తున్నారని, ఒక కృత్రిమమైన అభిప్రాయాలను ప్రజలపై రుద్ది, తద్వారా ఏదో జరుగబోతుందని మభ్యపెడుతున్నారన్నారు. ఇందుకోసం కర్మాగారాలు కూడా పెట్టారన్నారు. టీవీ ఆర్టీసీలను తీసుకొచ్చి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. గుంటూరులో నిన్న ఒక శిబిరం పెట్టారు. అందులో కొందర్ని బాధితుల మాదిరిగా చిత్రీకరించారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు మమ్మల్ని కొడుతున్నారని చెప్పించారు. ఆ విషయాలను ఎల్లోమీడియా ప్రచారం చేయించి, వైయస్‌ జగన్‌ ప్రభుత్వం విఫలమైందని విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు మాకు 80 శాతం ఆమోదం తెలిపారన్న చంద్రబాబును ఆ ప్రజలే ఎన్నికల్లో ఫెయిల్‌ చేశారన్నారు. ఐదేళ్లు పరిపాలన చేసిన చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారన్నారు. ఆయన రాజకీయ వారసుడు లోకేష్‌ మంగళగిరిలో తుక్కుతుక్కుగా ఓడిపోయారన్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌ వంద రోజుల పరిపాలనపై చంద్రబాబుకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ పడవ మునిగిపోతుందని, ఇది మళ్లి వచ్చే ఎన్నికల్లో నిలబడదని, బీజేపీలోకి ఆ పార్టీ నేతలు దూకుతున్నారని గ్రహించి చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు తానే పోటీ అని చెప్పుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని విమర్శించారు. బాబు హయంలో పల్నాడులో ఒకే రోజు ఏడు హత్యలు జరిగాయి. పల్నాడు మా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టి చక్కగా పాలిస్తుంటే మాపై విమర్శలా? . తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దురంకారంతో దాడి చేశారన్నారు. దాన్ని సపోర్టు చేసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.

ఎమ్మెల్యే  శ్రీదేవి క్రిస్టియన్‌ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని చంద్రబాబు ట్విట్‌ చేయడం దుర్మార్గమన్నారు. శ్రీదేవి ఓ ఎస్సీ మహిళ అని ఎన్నికల కమిషన్‌ ధ్రువీకరించిందని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఎస్సీలు క్రిస్టియన్లుగా మారితే దళిత క్రిస్టియన్లుగా గుర్తించాలని చెప్పిన చంద్రబాబే ఇలా మాట్లాడితే..ఆయన నిజమైన నైజం ఏంటో అర్థమవుతుందన్నారు. గతంలో బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారని, ఆయన వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మూడు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, అందులో 1.28 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓవరాక్షన్‌ తగ్గించుకోని, వాస్తవాలు గమనించాలని సూచించారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ఆయన్ను ప్రజలు క్షమించరన్నారు.

Back to Top