మూలన కూర్చోబెట్టినా బాబుకు బుద్ధిరాలేదు

తండ్రీకొడుకులు ట్వీట్ల మీద ట్వీట్లు కొడుతున్నారు

ప్రజాధనం ఆదా చేయడమే ప్రభుత్వ ధ్యేయం

రివర్స్‌ టెండరింగ్‌ బ్రహ్మాండమైన సక్సెస్‌

విద్యార్థుల మనోభావాలను దెబ్బతినేలా చంద్రబాబు బురద జల్లుతున్నారు

రాజధానిలో చంద్రబాబు ఎందుకు సొంత ఇల్లు కట్టుకోలేకపోయారు?

కమలంలో ఉన్న పచ్చ పుష్పం  సుజనా చౌదరి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: ప్రజాధనం ఆదా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై విషం కక్కేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని, వారికి కొన్ని పత్రికలు వంత పాడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరం చూశామని, చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ఓ మూలన కూర్చోబెట్టినా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండర్లతో చంద్రబాబు అవినీతి భాగోతం సాక్ష్యాధారాలతో బయటపడుతోందన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా వైయస్‌ జగన్‌ అవినీతిరహిత రాష్ట్రంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తుంటే చంద్రబాబు రక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా దాదాపు రూ.850 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందని తెలిపారు. వైయస్‌ జగన్‌ కృషిని ప్రజలు హర్షిస్తుంటే..చంద్రబాబు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఫైర్‌ అయ్యారు. పీపీఏ ద్వారా ఏడాదికి రూ.2500 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోందని, దాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు పీపీఏల్లో వందల కోట్లు కమీషన్‌ పేరుతో నొక్కేశారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబు ఐదేళ్లు అధికారాన్ని కట్టబెడితే..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు.  గ్రామ సచివాలయ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతినేలా చంద్రబాబు బురద జల్లుతున్నారని ఫైర్‌ అయ్యారు.అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ట్వీట్ల మీద ట్వీట్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. వీరికి కొన్ని పత్రికలు కూడా  వంత పాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు దుర్మార్గపు పాలన చూశారని, నదీగర్భంలోని ఓ ఇంట్లో చంద్రబాబు అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబుకు ఎందుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. రాజధానిలో చంద్రబాబు ఎందుకు సొంత ఇల్లు కట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అక్రమంగా కట్టిన నివాసంలో చంద్రబాబు ఉండటం మంచిపద్ధతి కాదని హితవు పలికారు.అక్రమంగా కట్టిన ఇంట్లో ఉండేందుకు చంద్రబాబుకు సిగ్గులేదా అని నిలదీశారు.ఇంటిని కూలగొడితే సానుభూతి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. లాంచీని వెలికి తీసేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కమలంలో ఉన్న పచ్చ పుష్పం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అని ఎద్దేవా చేశారు. అవినీతిని అంతం చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు. అవినీతిరహితంగా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, వారికి వంత పాడే కొన్ని పత్రికల అసత్యాలను నమ్మొద్దని ప్రజలకు అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. 

Back to Top