చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

పార్టీని నడపలేమోననే అనుమానంతో ఉన్నాడు

అందుకే ఈవీఎంలపై రచ్చ చేస్తున్నాడు

2014లో ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయని బాబుకు గుర్తులేదా..?

ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని టీడీపీకి 150 సీట్లు అంటున్నాడు

ఓటమి భయంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నాడు

సుప్రీం తీర్పుతోనైనా రచ్చ చేయడం మానుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

హైదరాబాద్‌: ఫలితాలకు ముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై నెపం నెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రోజుకు ఒక మాట పొంతనలేకుండా మాట్లాడుతున్నాడన్నారు. ఒకపక్క టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని అంటూనే.. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని నాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పోలింగ్‌ అయిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉందన్నారు. రాష్ట్రంలో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఏ ఒక్కరూ ఈవీఎంలపై, వీవీ ప్యాట్‌లపై ఆరోపణలు చేయలేదన్నారు. చంద్రబాబు ఓటు వేసిన తరువాత గంటకు పోలింగ్‌ సరళి చూసి భయపడి ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయని మర్చిపోయారా చంద్రబాబూ అని ప్రశ్నించారు.

ఒక్కో ఈవీఎం ట్యాంపరింగ్‌కు రూ. 10 లక్షలు ఇచ్చి రష్యా నుంచి మనుషులను తీసుకొచ్చారని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 98 వేల ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయని, అంటే రష్యా నుంచి 98 వేల మందిని తీసుకొచ్చారా చంద్రబాబూ అని నిలదీశారు. ఓటమి భయం పట్టుకొని ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5 శాతం వీవీ ప్యాట్‌లను కౌంట్‌ చేయాలని కోర్టు తీర్పు ఇస్తే, దాన్ని సవాల్‌ చేస్తూ 50 శాతం లెక్కించాలని కోర్టులో పిటీషన్‌ వేస్తే సుప్రీం కోర్టు ఆ పిటీషన్‌ను కొట్టివేసిందన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఈసీ ఫైనల్‌ అని చంద్రబాబు మాట్లాడారని, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయన్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్న అధికారులను తీసుకొచ్చి ఎన్నికలు జరపాలనుకున్నాడని, ఎన్నికల కమిషన్‌లో కూడా టీడీపీ కార్యకర్తలను జొప్పించాడన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని, త్వరలో వారు యాక్షన్‌ కూడా తీసుకుంటారని చెప్పారు. ఓడిపోతే ఏ పార్టీ పలకరించదనే భయంతో చంద్రబాబు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఈవీఎంలపై నెపం నెట్టి క్యాడర్‌ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఎన్నికల సంఘాన్ని, అధికారులను వాడకూడని పదజాలంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2014లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం.. కానీ, ఓడిపోయాం.. అయినా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజలతో ఉన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేశారన్నారు. చంద్రబాబు కూడా నిజమైన నాయకుడు అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. టీడీపీ ఓడిపోతే పార్టీని నడపలేనేమో.. లోకేష్‌ తన సమర్థతను ఇప్పటికే నిరూపించుకున్నాడు కాబట్టే చంద్రబాబు భయపడుతున్నాడన్నారు. ఎన్నికల్లో ఎవరికైనా గెలుపు ఓటములు సహజం. ఓటమిని కూడా స్వీకరించి గౌరవంగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులకు పదవి అప్పగించడం ప్రజాస్వామ్యం అని 40 ఏళ్ల ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈవీఎంలపై రచ్చ చేయాలనుకోవడం అమాయకత్వమని, దయచేసి చంద్రబాబు ఇప్పటికైనా మానుకోవాలని నాగిరెడ్డి సూచించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top