వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

వైయ‌స్ఆర్‌సీపీ  అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి 
డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది.  

సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు: చెవిరెడ్డి
సీఎం వైయ‌స్‌ జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలోని 23 అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రతి అనుబంధ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 

వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు జాబితా
►శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ


►విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి


►కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్‌, మిథున్‌రెడ్డి


►కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి

►పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి


►నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి


►అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


►కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

 

వైయ‌స్ఆర్‌సీపీ నూత‌న జిల్లా అధ్య‌క్షుల జాబితా..

  •  పార్వతీపురం మన్నెం జిల్లా అధ్యక్షుడిగా ప‌రీక్షిత్ రాజు
  •  విశాఖపట్నం జిల్లా అధ్య‌క్షుడు పంచ‌కర్ల రమేష్ 
  •  గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌
  •  ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా  జంకె వెంకటరెడ్డి
  •  కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేయర్ బీవై రామయ్య
  •  అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నర్సింహయ్య 
  • చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భరత్ 
  • తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి 
  •  
Back to Top