అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలి 

రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు 
 

 అమరావతి: వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి వైయస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Back to Top