రాళ్లపల్లి మృతికి వైయ‌స్ జగన్ సంతాపం

రాళ్లపల్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  
 

హైద‌రాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ   అధినేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. రాళ్లపల్లి కన్నుమూసిన విషయం తెలియ‌గానే  వైయ‌స్ జగన్ ఎంతో విచారానికి లోనయ్యారు. ట్విట్ట‌ర్ ద్వారా రాళ్లపల్లి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఓ నటుడిగానే కాకుండా దర్శకరచయితగా అటు నాటక రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ అనితరసాధ్యమైన రీతిలో ఎన్నో ఘనతలు సాధించారని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

Back to Top