చంద్ర‌బాబు తాళ‌ప‌త్రాలు విడుద‌ల చేసినా న‌మ్మేవారు లేదు 

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

అమ‌రావ‌తి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మ‌రోసారి ట్విట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు.  అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాలను ఇప్పుడు బయటపెడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 

Back to Top