ఇలాంటి శోకాలెందుకు బాబూ?

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

 అమరావతి: మే నెలలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి తమని ఇబ్బంది పెట్టాలని చూశారని, ఇలాంటి శోకాలెందుకని  వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబుపై ట్వీట‌ర్‌లో స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచే సీనుంటే చంద్రబాబు నాయుడు నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని ఆయ‌న నిల‌దీశారు.  ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్‌ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయడంని సూచించారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని, కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. . కాగా ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని తాను చేయించిన నాలుగు సర్వే ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
 
 

తాజా ఫోటోలు

Back to Top