కేశినేని నాని..ఎంపీ పదవికి రాజీనామా చెయ్యి

ఇండిపెండెంట్ గా పోటీ చేసి 40 ఓట్లు తెచ్చుకో

ట్విట్టర్ లో పీవీపీ వరప్రసాద్ సవాల్

విజ‌య‌వాడ‌:  కేశినేని నాని మొనగాడే అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి 40 ఓట్లు తెచ్చుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్ సభ నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  పీవీపీ వరప్రసాద్ సవాల్ విసిరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, "నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు. మొనగాడివి, మొలతాడు కట్టిన మగాడివి అయితే, రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!" అని అన్నారు.

అంతకుముందు "పాపం పార్టీ బండి మూల పడింది అని, దాని  తరపున పోటీ చేసి డబ్బా  కొట్టుకున్న 2 లక్షల మెజారిటీ కొంచెంలో మిస్ అయ్యానే, అని చాలా ఫీల్ అవుతున్నావంటా! అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, 4 లక్షల మెజారిటీ కొడతావేమో!! నీ బస్సులన్నీ బ్రాండ్ న్యూ కదా!" అని అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top