ఇన్‌ సైడర్‌ ట్రేడింగులో తలపండిన వ్యక్తి చంద్రబాబు 

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ: ప్రజల అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలో లేకుండాపోయారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. అదే జరగకుంటే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తను అని చంద్రబాబు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. ఆయన ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ లో తలపండినవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అమరావతిలో ‘గాయపడిన’ వారందరినీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించేవారని వ్యాఖ్యానించారు.

80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఐటీసీ, మహీంద్రా, ఫ్యూచర్‌ గ్రుప్‌ వంటి కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ చేస్తాయని చంద్రబాబు గతంలో చెప్పారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ మేరకు గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ కంపెనీలు కొనుగోలు చేస్తున్న వస్తువులేమిటో చంద్రబాబు, ఆయన అనుచరులు సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. 
 

Back to Top