వైయస్‌ జగన్‌ ప్రజా నేత

100 రోజుల సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన రాబోయే తరాలకు చిరస్థాయిగా నిలిచిపోతుంది

వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు వైయస్‌ జగన్‌ చట్టబద్ధత కల్పించారు

అమరావతి రాజధాని అని చెప్పి బాబు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు

అన్నింటిలో తాత్కాలికంగా వ్యవహరించిన చంద్రబాబు

అమరావతికి ఒక అడ్రస్‌ లేకుండా చేశారు

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పాలి

పవన్‌ కళ్యాణ్‌లా నాకు నటించడం రాదు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా నేత అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేవారే ప్రజా నాయకుడు అవుతారని, వైయస్‌ జగన్‌ 100 రోజుల పాలన రాబోయే తరాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. మీ నాన్న చంద్రబాబే తుగ్లక్‌ అని తెలుసుకోవాలని నారా లోకేష్‌కు సూచించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వంద రోజుల పాలనపై బొత్స సత్యనారాయణ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనతో ఏ విధంగా ప్రజా హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయారో.. అదే రీతిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారు. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వారే ప్రజా నాయకులు అవుతారు. అటువంటి ప్రతి కార్యక్రమాలను వంద రోజుల్లో సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపించారు. వంద రోజుల పాలన రాబోయే తరాలకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వైయస్‌ జగన్‌ మొట్టమొదటి సంతకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు లాంటి వ్యక్తులు మొదటి సంతకాలను విస్మరించడం. వాటికి విలువల లేకుండా చేసిన సందర్భాలు మనం చూశాం. రైతు రుణమాఫీ అని దాంట్లో కోతలు పెట్టారు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు. సృజల స్రవంతి అని వాటన్నింటికీ విలువ లేకుండా పోయింది.
సీఎం వైయస్‌ జగన్‌ అలా కాదు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను టైమ్‌ బాండ్‌ పెట్టి మొదటి శాసనసభ సమావేశాల్లోనే చట్టాలు చేసి మేనిఫెస్టోలోని అంశాలకు చట్టబద్ధత తీసుకువచ్చారు.  
ప్రతిపక్షంలో ఉన్నాం మాట్లాడాలని చంద్రబాబు ఇష్టానుసారంగా  మాట్లాడుతున్నారు. ఆయన భాష కంటే ఆయన కడుపుమంట కనిపిస్తుంది. ఇంతబాగా పరిపాలన చేస్తున్నాడని తట్టుకోలేని కడుపుమంట చూస్తున్నాం. ఇచ్చిన మాట కోసం ముందుకు వెళ్లాలని కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం వైయస్‌ జగన్‌ మంత్రులందరికీ సూచించారు. ప్రతి సంక్షేమ పథకానికి డెడ్‌లైన్‌ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. వంద రోజుల్లో 110 అంశాలను తీసుకువచ్చారు. ఏ కార్యక్రమం చేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

లోకేష్‌ ట్విట్టర్‌లో తుగ్లక్‌ పాలన అంటున్నాడు. తుగ్లక్‌ ఎలాంటి వాడో తెలుసా లోకేష్‌.. మీ నాన్నది తుగ్లక్‌ పాలన తెలుసుకో. అర్ధరాత్రి మూటముళ్లె సర్దుకొని వచ్చింది చంద్రబాబు. ట్విట్టర్‌లో రెండు వ్యాఖ్యలు రాసి మేమే మేధావులం అనుకుంటే ఎలా లోకేష్‌.
అభివృద్ధి, సంక్షేమం, మరోపక్క సమాజంలో మార్పు తీసుకురావడానికి సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్దానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, వాటర్‌ ప్లాంట్, రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకువచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఎందుకు ఉద్దానం బాధితులను పట్టించుకోలేదు. అంటే దానికి సమాధానం లేదు. గ్రామాల నుంచి బహిష్కరించారని ఎక్కడైనా వచ్చిందా... పెయిడ్‌ ఆర్టిస్టుతో డ్రామాలాడిస్తూ.. రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా విధానం మాకు ఉంది. మా కార్యక్రమం మాకు ఉంది.. ఆ రకంగానే ముందుకువెళ్తాం.

సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి ప్రత్యేకహోదాపై లేఖ ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు అవినీతి వృద్ధిని వైయస్‌ జగన్‌ దిగజార్చారు. అవినీతి లేని పాలన చేస్తున్నారు. కోడెల శివప్రసాద్‌ రాజకీయ నాయకుడంటే చీదరించుకునే పరిస్థితి తీసుకువచ్చారు. చింతమనేని ప్రభాకర్‌పై కేసులు ప్రభుత్వం పెడుతుందా.. ఆయన దళితులను తిడితే పోలీసులు కేసులు పెడుతున్నారా ప్రజలంతా చూస్తున్నారు. కూన రవికుమార్‌పై కేసులు ఎలా నమోదయ్యాయో ప్రపంచం అంతా చూస్తుంది. కూన రవికుమార్‌ అధికారులను దూషించలేదు. కోడెల ట్యాక్స్‌ వసూలు చేయలేదు అని చంద్రబాబు చెప్పమనండి. వంద రోజుల్లో ప్రజల అవసరాల కోసం పోరాటం చేసిన ఒక్క కార్యక్రమాన్ని చెప్పమనండి. వరదలు వస్తే దాన్ని చంద్రబాబు బురద రాజకీయం చేశారు. మా బైబిల్, మా ఖురాన్, మా భగవద్గీత మా మేనిఫెస్టో.. మేనిఫెస్టో ప్రకారం ముందుకు వెళ్తాం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందా.. చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రానికి అడ్రస్‌ లేకుండా చేసి ప్రతి విషయాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు.

తండ్రి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఇంత మంచి పాలన చేస్తుంటే అభినందించాల్సిందిపోయి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు. వంద రోజుల పాలన చూసి ప్రజలంతా ఈ ప్రభుత్వం మాది అనుకుంటున్నారు. ఇంకా మున్ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం.

 

Back to Top