పేదలకు వైద్యం అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

ఆరోగ్యశ్రీలో అదనంగా 1000 రకాల వైద్య సేవలు 

ప్రతి మండలానికి ఒక 108 వాహనం 

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

విశాఖ: పేదలకు వైద్యం అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. విశాఖ జెడ్పీ హాలులో వైద్య. ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం సంకల్పించారన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించామని చెప్పారు. ప్రతి రూపాయి నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. మారుమూల ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో మరో 1000 వైద్య సేవలను పెంచామని తెలిపారు. 104, 108 వాహనాల్లో సౌకర్యాలను పెంచబోతున్నామని పేర్కొన్నారు. 773 కొత్త 108 వాహనాలను కొనుగోలు చేయబోతున్నామన్నారు. 676 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. సెప్టెంబర్‌ మొదటివారంలో టెండర్లు ఖరారు చేస్తామని నాని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 
 

Back to Top