బాబు, ప‌వ‌న్‌, ష‌ర్మిల‌పై ఈసీకి ఫిర్యాదు

తాడేప‌ల్లి: తెలుగుదేశం పార్టీ, జనసేన అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్, పీసీసీ అధ్య‌క్షురాలు షర్మిలలు ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని, పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్‌సీపీ  ఫిర్యాదు చేసింది. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, గ్రీవెన్స్ సెల్ రా ష్ట్ర అధ్య‌క్షుడు నారాయణమూర్తి, పార్టీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి లు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల అధికారులకు అందచేశారు.

1.  తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం.కాబట్టి తెలుగుదేశం పార్టీ పై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

2. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నరసాపురం,భీమవరం ఎన్నికల సభలలో ఈనెల 21 వతేదీన వైయస్ఆర్‌సీపీ  నేతలు ప్రసాదరాజు,సజ్జల రామకృష్ణారెడ్డి గార్లపై  ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యక్తిగతంగా  అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

3.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  అధ్యక్షురాలు షర్మిల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వివేకానంద రెడ్డి హత్య గురించి బహిరంగసభలలో మాట్లాడుతున్నారు,ఆరోపణలు చేస్తున్నారు. ఇలా పదే పదే చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేత‌లు కోరారు.
 

Back to Top