ఇకనైనా చంద్రబాబు మర్యాదగా అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలి

అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇకనైనా మర్యాదగా అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సూచించారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటూ..ప్రభుత్వం వరద పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలు ఉపయోగిస్తే టీడీపీ నేతలు గొడవ చేయడాన్ని ఆయన ఖండించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కృష్ణానదికి ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలను కాపాడటానికి, అప్రమత్తం చేయడానికి అధికారులు డ్రోన్‌ వినియోగించారని తెలిపారు. కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కరకట్ట లోపల ఇల్లు ఉంది..అది అక్రమ నివాసం కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆ అక్రమ నివాసాన్ని మర్యాదగా ఖాళీ చేయాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి వరద తాకిడి ఇంట్లోకి రాకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారన్నారు. చంద్రబాబు నివాసంలోని రివర్‌ వ్యూ బిల్డింగ్‌ సగం మునిగిపోయిందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top